అందరూ తెలుసుకోవాల్సిన ఫ్లాగ్‌ కోడ్‌ 2002 నిబంధనలు

జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్‌ కోడ్‌ 2002 నిబంధనలు పాటించడం తప్పనిసరి

ఫ్లాగ్‌ కోడ్‌ను ఉల్లంఘించనట్లైతే చట్ట ప్రకారం జైలు శిక్షలు, జరిమానాలు తప్పవు

జెండా ఎగురేసేటప్పుడు అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు

మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప జెండాపై మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు

కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి

నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషాయ రంగు ఎడమ వైపున ఉండాలి

ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు

జెండా వందన సమయంలో దానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు

జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదు, అలంకరణ సామగ్రిగా ఉపయోగించరాదు

పబ్లిక్‌ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్‌ పైన కుడి వైపున మాత్రమే జెండాను నిలపాలి

జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు, పతాకం మధ్యలో పూలను వాడొచ్చు

వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు, దుస్తులుగా కుట్టించకూడదు.