నల్లచీమల తెచ్చే అనారోగ్యాలు అన్నీ ఇన్నీ కావు. వాటి సంచారం బాత్‌రూమ్‌ అవుట్‌లెట్‌ దగ్గర మొదలై సింకుల వరకు విస్తరిస్తుంటుంది.

వాటి బెడద వదలాలంటే... దాల్చిన చెక్క పొడిని బాత్‌రూమ్‌ మూలల్లోనూ, అవుట్‌లెట్‌ దగ్గర చల్లాలి.

సింకుల్లో కూడా చల్లి ఒక గంట సేపు నీటిని వదలకుండా ఉంటే చీమలు పరారవుతాయి.

స్వీట్‌ బాక్సులు, టిన్నులకు చీమలు పట్టకుండా ఉండాలంటే వాటిని ఉంచి ప్రదేశంలో ఆ డబ్బాల చుట్టూ చాక్‌పీస్‌తో గీత గీయాలి.

ఆ డబ్బాలను టేబుల్‌ మీద ఉంచినట్లయితే టేబుల్‌ కాళ్లకు చాక్‌పీస్‌ గీతలు దట్టంగా గీస్తే చాలు.

చక్కెర డబ్బా అడ్రస్‌ పట్టేయడంలో ఎర్రచీమలు చాలా షార్ప్‌.

చీమలను చక్కెర డబ్బా దరిదాపులకు కూడా రానివ్వకుండా నివారించాలంటే చక్కెరలో రెండు లవంగాలు వేయాలి.