బాటిల్‌లో తేమ చేరి ఇన్‌స్టంట్‌ కాఫీ పొడి గట్టిపడుతుంటుంది.

అలా కాకుండా ఉండాలంటే బియ్యాన్ని ఒక చిన్నగుడ్డలో మూట కట్టి డబ్బాలో పెట్టి మూతపెడితే సరి

∙ఐరన్‌ పెనం మీద కాఫీ పొడిని వేసి వేడిచేయాలి.

ఈ పొడి నుంచి వచ్చే పొగకి కిచెన్‌లో ఉన్న ఈగలు, దోమలు పోతాయి.

మసాలా ఘాటు వాసన వస్తోన్న మిక్సీ జార్‌లో రసం తీసిన నిమ్మతొక్కలను వేయాలి

తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్‌ చేసి కడగడం వల్ల జార్‌లో వస్తోన్న వాసనలు పోతాయి.

టమోట, ఉల్లిపాయ ఒలవాలంటే మరుగుతున్న నీటిలో వేసి తీసి చన్నీటి ధార కింద పెడితే త్వరగా ఊడి వచ్చేస్తుంది.

వెల్లుల్లి రేకల పొట్టు త్వరగా ఊడి రావాలంటే ఒలిచేటప్పుడు ఒకవైపు చాకుతో గాటు పెట్టి చివర నొక్కితే సరి.