1944లో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి.

ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు.

శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు.

శేషాద్రి తిరుమలలో పుట్టి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అప్పట్లోనే పీజీ చేశారు.

1978లో టీటీడీలో చేరిన ఆయన.. 2006 జూన్ లో రిటైరయ్యారు . అటు తర్వాత ఓఎస్డీగా సేవలందించారు.

శేషాద్రి అంటే అసలు ఎవరికీ తెలియదే. అదే డాలర్ శేషాద్రి అంటే సులువుగా గుర్తుపడతారు.

ఆయనకా పేరు రావడానికి రెండు కారణాలున్నాయి. నుదుట నామాలు ధరించి మెడలో పెద్ద డాలర్‌ను ధరించడం వల్లే డాలర్ అనే బిరుదు

సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం ఓఎస్డీ స్థాయికి ఎదిగారు.

50 ఏళ్ల నుంచి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది.

శ్రీవారి ఆలయానికి వచ్చిన ప్రముఖులకు శేషాద్రి చేతుల మీదుగానే మర్యాదలు జరుగుతుండేవి. ఆయనకు చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉండేవి.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దగ్గర నుంచి నేటి మోదీ వరకు ఎవరొచ్చినా డాలర్ శేషాద్రి దగ్గరుండి దర్శనాలు చేయించేవారు.