చిన్నచిన్న నలతలకు సైతం యాంటీబయాటిక్స్‌ వాడితే చివరకు పెను ప్రమాదం కొనితెచ్చుకుంటారని సైంటిస్టులు హెచ్చరిక

సహజసిద్ధ రోగనిరోధకతపై తీవ్ర ప్రభావం

యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడితే జీర్ణవాహికలోని ప్రయోజనకరమైన బాక్టీరియా(ప్రొబయాటిక్స్‌) నశిస్తాయి

యాంటీబయాటిక్స్‌ వాడకంతో ఫంగల్‌ వ్యాధులు సోకే అవకాశాలు

యాంటీబయాటిక్స్‌ వాడిన ఎలుకల్లో ఫంగస్‌ ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ కలిగించినట్లు కనుగొన్నారు

ఎలుకల్లోని సహజసిద్ధ యాంటీ ఫంగల్‌ ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను అది దెబ్బతీసిందని విశ్లేషించారు

రక్తంలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించే సైటోకైన్స్‌ అనే ప్రోటీన్ల ఉత్పత్తిని ఈ యాంటీబయాటిక్స్‌ తగ్గించాయి