చీతా, చిరుత, జాగ్వార్‌.. వేటికవే స్పెషల్‌

ప్రత్యేకమైన చారలు, గుర్తులు, ముఖ కవళికలు, పాదముద్రలతో వైవిధ్యం

పరిమాణంలో సన్నగా ఉండే చీతాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. చెట్లు కూడా సులభంగా ఎక్కగలవు.

లేత గోధుమ రంగు శరీరంపై.. నలుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా మచ్చలు ఉంటాయి.

మనుషులకు మరీ ప్రమాదకరమేమీ కావు. పెద్ద జంతువుల జోలికి కూడా వెళ్లవు.

భారత్‌లో 70ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. చీతా ప్రాజెక్టు ద్వారా మళ్లీ ఉనికిలోకి.

నెహ్రూ జూపార్కు సహా మరికొన్ని జూలలో చీతాలు ఉన్నాయి. అయితే, వీటిని అధికారిక లెక్కల్లో పరిగణనలోకి తీసుకోరు.

పులి జాతి జీవుల్లో చిరుతలు మధ్యస్థమైన పరిమాణంలో ఉంటాయి. పొడవు మాత్రం ఎక్కువ.

గడ్డి మైదానాల్లోని చిరుతలు లేత పసుపు రంగులో.. దట్టమైన అడవుల్లో ఉండేవి ముదురు పసుపు రంగులో ఉంటాయి.

మచ్చలు ఎక్కువగా, పెద్దవిగా ఉంటాయి. క్రూరంగా వ్యవహరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి.

జాగ్వార్‌లు బరువైన, పెద్ద శరీరాన్ని.. పదునైన గోళ్లు, పళ్లు, పంజా కలిగి ఉంటాయి.

సింహం, పెద్దపులి తర్వాత జాగ్వార్‌ను మూడో పెద్ద జంతువుగా పరిగణిస్తారు. ఒంటిపై మచ్చలు పెద్దగా భిన్నంగా ఉంటాయి.

చిన్న చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువులపైనా దాడి చేస్తుంది. నీళ్లలో సులభంగా ఈదగలవు. మన దేశంలో జాగ్వార్లు లేవు.