కావలసినవి: పెద్ద రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి)

ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్‌, కార్న్‌పౌడర్‌ – అరకప్పు + 2 టేబుల్‌ స్పూన్లు, మైదా పిండి – ఒకటిన్నర కప్పులు

గుడ్డు – 1, కొత్తిమీర తురుము – కొద్దిగా

అల్లం పేస్ట్‌ – పావు టీ స్పూన్‌,వెల్లుల్లి పేస్ట్‌ – అర టేబుల్‌ స్పూన్‌, పంచదార – అర కప్పు

ఆరెంజ్‌ జ్యూస్, వెనిగర్‌ – పావు కప్పు చొప్పున, సోయా సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ముందుగా ఒక బౌల్‌లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అర కప్పు కార్న్‌ పౌడర్, మైదా పిండి, గుడ్డు వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌తో బాగా కలపాలి.

కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బ్లెండర్‌ సాయంతో కాస్త జారుగా కలుపుకుని.. అందులో రొయ్యలు వేసుకుని ఆ బౌల్‌కి పైన ఓ కవర్‌ చుట్టబెట్టి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

అనంతరం నూనెలో వాటిని డీప్‌ ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి.

మరో బౌల్‌ స్టవ్‌ మీద పెట్టుకుని.. 1 టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకుని, అందులో అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, పంచదార, ఆరెంజ్‌ జ్యూస్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి.

కాసేపటి తర్వాత వెనిగర్, సోయాసాస్‌ వేసుకుని తిప్పుతూ ఉండాలి.

ఒక చిన్న బౌల్‌లో 2 టేబుల్‌ స్పూన్ల కార్న్‌ పౌడర్‌లో 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలిపి ఆ మిశ్రమాన్నీ వేసుకోవాలి.

పాకం కాస్త దగ్గర పడుతున్న సమయంలో డీప్‌ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో బాగా తిప్పి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.