జాగింగ్‌ చేసే టైంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్‌ అనే హార్మోన్స్‌ విడుదల అవుతాయి. ఇది మానసిక ప్రశాంతకు సహాయపడుతుంది.

ఈ ఫీల్‌ గుడ్‌ హార్మోన్స్‌ సహజంగానే మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి. దీంతో రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

శరీరం ఉత్సాహంగా, కదలికలు కలిగి ఉండటం వల్ల కండరాలు కరిగి, బాడీ షేప్‌ మారి చూడటానికి అందంగా మారుతారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శ్వాసవ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్‌ ను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి జాగింగ్‌ మంచి మార్గం.

జాగింగ్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా వ్యాధులతో, ఇన్ఫెక్షన్స్‌ తో పోరాడే శక్తి పెరుగుతుంది.

తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో స్ట్రెస్, డిప్రెషన్, అలసట తగ్గుతాయి.

కండరాల శక్తిని మెరుగు పరుస్తుంది. వెన్నెముక, తొడల భాగాన్ని దృఢంగా మార్చుతుంది.

ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక, శారీర ఆరోగ్యాలన్నింటికి చాలా మేలు చేస్తుంది.

జాగింగ్‌ వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. పాజిటివ్‌ శక్తి వస్తుంది.

చర్మానికి రక్తప్రసరణతో పాటు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. దాంతో నిత్యం యవ్వనంగా కనబడుతారు.

ఐతే కేవలం జాగింగ్‌ ఒక్కటే చేస్తే సరిపోదు. ఆహారంపై అదుపు కూడా ఉండాలి. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.