ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న సీతాఫలం అనేక పోషకాలు, విటమిన్లకు స్టోర్‌ హౌస్‌ లాంటిది.

ఈ పండ్లలో విటమిన్‌ ఏ, సీ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌లు పుష్కలంగా ఉంటాయి.

సీతాఫలం తినడం వల్ల కడుపులో ఎసిడిటీ, అల్సర్స్‌ వల్ల ఏర్పడే మంట తగ్గుతుంది.

దీనిలో సూక్ష్మ పోషకాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.

కంటి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఐరన్‌ స్థాయులు హిమోగ్లోబిన్‌ను మెరుగుపరుస్తాయి. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది.

పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల మలబద్దక సమస్య పరిష్కారమవుతుంది.

సీతాఫలం బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.

దీనిలోని పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచడానికి తోడ్పడుతుంది.