గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడం, నివారణ మార్గాల సూచనకై వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహణ

గుండె పదిలంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీర వేడిని తగ్గిస్తూ తాపాన్ని తీర్చే పుచ్చకాయ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇది కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంతో పాటు ముప్పుకారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇక డిప్రెషన్‌ను దూరం చేసే డార్క్‌ చాక్‌లెట్‌ గుండె ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగకరం.

డార్క్‌ చాక్‌లెట్‌ బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యకర స్థాయిలో కొలెస్ట్రాల్‌ ఉండేలా చూస్తుంది.

ప్రతిరోజూ ఓట్స్‌తో చేసిన ఆహార పదార్ధాలతో గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

వీటిలో ఉండే ఫైబర్‌తో చెడు కొవ్వులు తగ్గడమే కాక జీర్ణశక్తి మెరుగవుతుంది.

ఇక బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌ వంటి నట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే చాలా మంచిది.

వీటి వల్ల శరీరంలోని చెడు కొలెస్ర్టాల్‌ తగ్గడంతో పాటు అవసరమైన విటమిన్‌ ఈ, ప్రొటీన్ ఫైబర్‌లు శరీరానికి అందుతాయి.

గుండె ఆరోగ్యానికి గ్రీన్‌ టీ, ఫ్యాటీ ఫిష్‌, సినామన్‌లు కూడా ఎంతో ఉపకరిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.