విటమిన్‌ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు.

సీ ఫుడ్‌ (సముద్ర ఆధారిత ఆహారాలు), గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్‌ ఉంటుంది.

ఏదిఏమైనప్పటికీ శాఖాహారులు ఈ విటమిన్‌ లోపంతో అధికంగా బాధపడుతున్నారు.

విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

విటమిన్‌ బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది.

ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి 12 బాధ్యత వహిస్తుంది.

ముఖ్యంగా విటమిన్‌ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్‌ బి12 లోపం మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.

మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

కొన్ని సందర్భాల్లో మిమిక్‌ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది.

విటమిన్‌ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి.

అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు.

గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.