జలుబు, తలనొప్పి వేధిస్తోందా?.. ఈ చిట్కాలు పాటించండి.

బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువగానూ వుంటాయి.

భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి.

బాదం, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది.

బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో చర్మం త్వరగా ముడతలు పడకపోోవడాన్ని చూస్తుంటాం. ఎక్కువ సేపు నమలడం ద్వారా చర్మపు మెటబాలిజమ్‌ మెరుగై చర్మం ముడతలు పడదు.

పెరుగులో బెల్లం, మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు తగ్గుతుంది.

బొప్పాయి కాయ లేదా, ఆకుని మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.

గ్లాసు మజ్జిగలో తురిమిన అల్లం లేదా శొంఠి పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.

మూడు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్, రెండు టీ స్పూన్ల యూకలిప్టస్‌ ఆయిల్‌ను షాంపూలో కలుపుకొని తలస్నానం చేస్తే పేలు పోతాయి..