కావల్సినవి: గుడ్లు – రెండు, పాలు – కప్పు, గోధుమ పిండి – కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టీస్పూన్లు

పాలకూర – మీడియం సైజు కట్ట ఒకటి, చీజ్‌ – నాలుగు ముక్కలు, ఉప్పు – రుచికి సరిపడా

తయారీ: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి

ఒక గిన్నెలో గోధుమ పిండి, గుడ్లసొన, పాలు వేసి ఉండలు లేకుండా దోశ పిండిలా కలుపుకోవాలి

అవసరాన్ని బట్టి కొద్దిగా పాలు కూడా పోసుకోవచ్చు

స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసి పిండి మిశ్రమాన్ని మందమైన దోశలాగా వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి

తరువాత మరోవైపు తిప్పి ఐదు నిమిషాలు ఉడికించాలి

ఇప్పుడు పాన్‌కేక్‌ మీద ఉడికించిన పాలకూర మిశ్రమం, చీజ్‌ తురుము వేస్తే స్పినాచ్‌ పాన్‌ కేక్‌ రెడీ