కర్బూజా జ్యూస్‌

అరకేజీ మస్క్‌మిలాన్‌ (కర్బూజ) ముక్కలను మిక్సీజార్‌ లో వేసుకోవాలి.

దీనిలో రెండు అంగుళాల అల్లం ముక్కను తురుముకుని వేయాలి.

రుచికి సరిపడా పంచదార, చిటికెడు ఉప్పు, టీస్పూను మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకుని నిమ్మరసం, ఐస్‌ ముక్కలు వేసి కలిపి సర్వ్‌ చేసుకోవాలి.

మస్క్‌మిలన్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

రక్త పీడనం ఎక్కువగా ఉన్న వారు ఈ జ్యూస్‌ తాగితే రక్తపీడనాన్ని క్రమబద్ధీకరించి బీపీని నియంత్రణలో ఉంచుతాయి.

జ్యూస్‌లో ఉన్న విటమిన్‌ ఏ, బీటా కెరోటిన్‌లు కంటిలో శుక్లం ఏర్పడకుండా నిరోధిస్తాయి.

దీనిలోని పోషకాలతో కూడిన కార్బోహైడ్రేట్స్‌ బరువుని నియంత్రణలో ఉంచుతాయి.