వినాయకుడికి ఇష్టమైన మావ మోదక్‌

కావాల్సిన పదార్థాలు... నెయ్యి – నాలుగు టీస్పూన్లు పాలు – అరకప్పు కుంకుమ పువ్వ కలిపిన పాలు – తొమ్మిది టీ స్పూన్లు పాలపొడి – నాలుగున్నర కప్పులు

పంచదార పొడి – ఒకటిన్నర కప్పులు యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూను

జీడిపప్పు ముక్కలు – ఆరు టీస్పూన్లు బాదం పలుకులు – ఆరు టీస్పూన్లు.

తయారీ... స్టవ్‌ మీద కడాయి పెట్టుకుని టీ స్పూను నెయ్యి, అరకప్పు పాలు, మూడు టీ స్పూన్ల కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసి కలుపుకోవాలి.

ఇప్పుడు పాలపొడి వేసి సన్నని మంట మీద ఉడికిస్తూ తిప్పుతుండాలి.

ఈ మిశ్రమం చిక్కబడి కడాయికి అంటుకోకుండా ముద్దలా మారుతుంది. దీనిని వేరేగిన్నెలోకి మార్చి చల్లారనివ్వాలి.

చల్లబడిన మిశ్రమంలో అర టీస్పూను యాలకులపొడి, అరకప్పు పంచదార పొడి వేసి చపాతి ముద్దలా కలపాలి.

మోదక్‌ మౌల్డ్‌కు కొద్దిగా నెయ్యిరాసి, పాలపిండి ముద్దను పెట్టి మధ్యలో జీడిపప్పు, బాదం పప్పుల మిశ్రమం పెట్టి వత్తుకోవాలి.

మోదక్‌లను సిల్వర్‌ ఫాయిల్‌తో గార్నిష్‌ చేస్తే మావా మోదక్‌ రెడీ.