బయట దొరికే పాస్ట్‌ఫుడ్స్‌లో పోషకాలు కంటే హానికర కారకాలే అధికంగా ఉంటాయి.

40 ఏళ్లకు పైబడిన వారు ఈ కింది ఆహారాల జోలికి పోకపోవడమే మంచిది.

బర్గర్స్‌: చాలామంది బర్గర్స్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. వీటిలో ఒమేగా–6ప్యాటీ యాసిడ్స్, సోడియంలు అధికంగా ఉంటాయి.

ఇవిశరీరానికి అనారోగ్యానికి హాని కలిగించేవే. వీటిని రోజూ తినడం వల్ల ఇతర రకాల అనారోగ్యాలతోపాటు, హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముప్పు ఎక్కువ ఉంటుంది.

ఎనర్జీ డ్రింక్స్‌: బాగా దాహంగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకునేటప్పుడు మరింత ఉత్సాహంగా ఉండేందుకు ఎనర్జీ డ్రింక్స్‌ను తాగుతుంటాము.

అయితే వీటిలో పంచదార, కెఫిన్‌ అధికమొత్తంలో ఉంటాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల చర్మం, దంతాలపై తీవ్ర చెడుప్రభావాన్ని కలిగిస్తాయి.

సోడా డ్రింక్‌: సోడాలో పంచదారతోపాటు కెఫిన్, ఫుడ్‌ కలర్‌ అధికంగా ఉంటుంది. ఈ మూడు శరీరానికి హాని కలిగించేవే.

డైలీ సోడా తాగడం వల్ల హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆహారాల జోలికి పోకుండా ఉంటే మంచింది.