టాక్సిన్‌లను బయటకు పంపే మారేడు జ్యూస్‌

మారేడు జ్యూస్‌ శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. చలువదనంతోపాటు తాజాదనాన్ని ఇస్తుంది.

ఈ జ్యూస్‌లోని టానిన్, పెక్టిన్‌లు డయేరియాను తరిమికొట్టడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

జ్యూస్‌ తయారీకి కావలసిన పదార్థాలు: పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా...

దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా.

జ్యూస్‌ తయారీ ఇలా: ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి.

తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్‌ను పిండుకోవాలి.

జ్యూస్‌ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి.

దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి.

చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్‌ చేసుకోవాలి.