ఎగ్‌ మఫిన్స్‌.. ఆయిల్, కారం, ఉప్పు నామమాత్రంగా వినియోగించి రుచిగా ఎలా వండాలో చూద్దాం...

కావల్సినవి: గుడ్లు – ఆరు, స్ప్రింగ్‌ ఆనియన్‌ – ఒకటి, ఉల్లిపాయలు – రెండు, టోపు – ఆరు ముక్కలు, చీజ్‌ తురుము – అరకప్పు, ఉప్పు – అరటిస్పూను, ఆలివ్‌ ఆయిల్‌ – టీ స్పూను.

తయారీ.. ముందుగా స్ప్రింగ్‌ ఆనియన్, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

తరువాత టోపును కూడా క్యూబ్‌లుగా తరగాలి.

ఒక గిన్నెలో టోపు ముక్కలు, స్ప్రింగ్‌ ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌ తురుము గుడ్లు పగల కొట్టి వేసి కలపాలి.

ఉప్పువేసి మరోసారి కలపాలి

ఇప్పుడు మఫిన్‌ ఉడికించే పాత్రకు ఆలివ్‌ ఆయిల్‌ రాయాలి.

దానిలో ఈ గుడ్ల మిశ్రమాన్ని వేసి ఇరవై నిమిషాలపాటు బేక్‌ చేస్తే ఎగ్‌ మఫిన్స్‌ రెడీ.