మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగా చేర్చాలి.

మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆకు కూరల్లో అన్ని రకాల పోషక పదార్థాలూ ఉంటాయి.

ముఖ్యంగా పోషకాహారనిధి అయిన పాలకూరలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయట.

పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సీడెంట్‌లు ఉన్నాయి.

ఇవి యాంటీ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

పాలకూరలో లభించే సి, ఏ విటమిన్‌లు, మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్‌లు క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడతాయి.

ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది.

ఎలాగైనా సరే ఆహారంలో పాలకూరను భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు.