పరిశోధనలు చెబుతున్నవి: చిలగడ దుంపలు

కార్బోహైడ్రేట్లు అధికం. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్‌ హార్మోన్‌ స్థాయిని ఇవి తగ్గిస్తాయని తేలింది.

మచా పొడి: గ్రీన్‌ టీ ఆకులతో చేసే ఈ పొడి జపాన్‌లో చాలా ప్రసిద్ధి.

ఇందులో ఎల్‌–థియానిన్‌ అనే ప్రొటీనేతర అమైనో ఆమ్లం ఎక్కువ పాళ్లలో ఉంటుంది.

షెల్‌ఫిష్‌.. రక్షణ కవచాలు ఉన్న నత్తలు, ఆల్చిప్పలు, మస్సెల్స్‌ వంటివి. వీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి.

మనసును ఉల్లాసంగా ఉంచగలిగే టారిన్‌ షెల్‌ఫిష్‌లో ఎక్కువ

స్విస్‌ చార్డ్‌.. శరీరంలో మెగ్నీషియం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు ఆందోళన, ఒత్తిడి లక్షణాలు కనిపిస్తాయి.

దీనికి విరుగుడుగా స్విస్‌ చార్డ్‌ అనే వంటకం సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు.

ఆర్గాన్‌ మీట్‌.. అవయవ మాంసం.

కోళ్లు, పొట్టేళ్లు, మేకలు వంటి జంతువుల గుండె, కాలేయం, మూత్రపిండాలతో చేసే వంటకాల్లో బి12, బి16, రైబోఫ్లవిన్, ఫ్లోట్‌ వంటివి ఎక్కువ

పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో విటమిన్‌ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది.

మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది.

వెల్లుల్లి.. ఇందులో సల్ఫర్‌ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి.

ఇవి గ్లటాథియోన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తిచేస్తాయి.