సొంఠిని పాలతో కలిపి తీసుకోవడం ద్వారా శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అందుతాయి.

సొంఠిని పొడిచేసుకుని పాలల్లో వేసుకుని తాగడం వల్ల ఈ సుగుణాలు శరీరానికి అందుతాయి.

సొంఠిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వైరల్, ఫ్లూ, జలుబు, వంటివి రావు.

పడుకునే ముందు ఈ సొంఠిపాలను తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

సొంఠిపాలతో ఆర్థరైటీస్, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

∙జీర్ణసంబంధ సమస్యలు ఏవి ఉన్నా సొంఠి కలిపిన పాలు తాగడం వల్ల తగ్గిపోతాయి.

కడుపు నొప్పి, ఎసిడిటీ, మలబద్దకం, పుల్లటి తేన్పుల నివారణలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉన్నప్పుడు సొంఠి కలిపిన పాలు తాగితే ..శరీర ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు, జలుబు, దగ్గుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.