నిరంతరం లబ్‌డబ్‌ అని కొట్టుకునే గుండె పనితీరు సక్రమంగా లేకపోతే ప్రాణానికి గ్యారెంటీ ఉండదు.

అందుకే గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం, జీవవనశైలి ఉండాలి.

ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు కొన్ని ఆహారాల జోలికి పోకపోవడమే మంచిది. అవేంటో చూద్దాం..

పొట్ట, గుండె ఆరోగ్యానికి మైదా మంచిది కాదు. హార్ట్‌ పేషంట్లు మైదాతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచింది.

ఆహారంలో ఉప్పు సరిపడా ఉంటే రుచిగా ఉంటుంది. కానీ ఉప్పు ఎక్కువ తీసుకుంటే బీపీ పెరిగి హార్ట్‌ ఎటాక్‌ సంభవిస్తుంది.

గుడ్డు పచ్చసొన కూడా హార్ట్‌ పేషంట్లకు మంచిది కాదు. అందువల్ల గుడ్లు తినే అలవాటు ఉన్నవారు మితంగా గుడ్లు తినాలి.

తీపి గుండెకు చేటు చేస్తుంది. తీపి ఆహారం, స్వీట్లు ఎక్కువ తింటే కొలెస్టాల్‌ పెరిగి రక్తప్రసరణను మందగించేలా చేస్తాయి.