హల్వా ఐస్‌ క్రీమ్‌ | Halwa Ice Cream Making Process

కావలసినవి: క్యారెట్‌-5 (తురుముకోవాలి), బాదం పేస్ట్‌-3 టేబుల్‌ స్పూన్లు, కోవా- అర కప్పు, దాల్చినచెక్క పొడి- అర టీ స్పూన్‌.

పంచదార-అర కప్పు, నెయ్యి-పావు కప్పు పైనే, ఫుడ్‌ కలర్‌-ఆరెంజ్‌ (అభిరుచిని బట్టి మార్చుకోవచ్చు), ఐస్‌ క్రీమ్‌-1 కప్పు (నచ్చిన ఫ్లేవర్‌) డ్రై ఫ్రూట్స్‌-గార్నిష్‌కి సరిపడా

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడికాగానే.. క్యారెట్‌ తురుము, బాదం పేస్ట్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి.

అందులో పంచదార కలిపి బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి.

కోవా, దాల్చిన చెక్క పొడి, ఫుడ్‌ కలర్‌ వేసుకుని బాగా కలుపుతూ కాస్త దగ్గరపడుతున్నప్పుడు.. మిగిలిన నెయ్యి కూడా వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

అనంతరం చల్లారనిచ్చి.. ఒక గ్లాస్‌ లేదా బౌల్‌లో సగంపైనే హల్వా మిశ్రమం వేసుకుని, పైన ఐస్‌ క్రీమ్, ఆపైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.

తర్వాత సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది.