అల్లం పాలు తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

ఒక కప్పు పాలలో టీ స్పూను అల్లం తురుము వేసి ఐదు నిమిషాలు మరిగించాలి

తరువాత చిటికెడు మిరియాలపొడి, చిటికెడు దాల్చినచెక్క పొడి, కొద్దిగా బెల్లం తురుము కలపాలి

గోరువెచ్చగా ఉండగానే ఈ పాలను తాగాలి

అల్లం పాలను రోజూ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి

అల్లం పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరానికి అందుతాయి

ముఖ్యంగా చలి కాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది