పిల్లల్లో కోవిడ్ లక్షణాలు..

జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు

రుచి, వాసన కోల్పోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, వికారం, దద్దుర్లు

పసివాళ్లలో అయితే ఎక్కువసేపు ఏడవడం, విచిత్ర ప్రవర్తన

జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే చికిత్స అందించొచ్చు

విడవకుండా గొంతు నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఆయాసం, ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 శాతం కన్నా పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లాలి

అదేపనిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలుంటే అశ్రద్ధ చేయకుండా ఆస్పత్రికి తరలించాలి

తీవ్ర అస్వస్థతకు గురైన పిల్లలకు వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి ఉంటుంది