కడుపు ఉబ్బరం.. అజీర్తి తగ్గాలంటే 

కడుపు ఉబ్బరాన్ని నివారించడంలో వ్యాయామం అతిముఖ్యమైంది. బ్రిస్క్‌వాక్‌ రోజు 40 నిమిషాలు ఉదయం, లేక సాయంత్రం చేయాలి. 

అన్నం తిన్న వెంటనే కొద్ది దూరం ఇంట్లోనే నడవాలి. నీళ్లు బాగా తాగాలి.

స్విమ్మింగ్‌ లేక తాడుతో గెంతడం (స్కిప్పింగ్‌) చేయాలి.  గ్యాస్‌ ఎక్కువ చేసే పదార్థాలు తగ్గించాలి.

ముఖ్యంగా మద్యం సేవించకూడదు. మసాలా దినుసులు తగ్గించాలి. వేళకు మితంగా భోజనం చేయాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. 

గ్లాస్‌ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించి వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. 

అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని తాగినా అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

చిటికెడు వాములో ఉప్పు వేసి నలిపి ఆ మిశ్రమాన్ని తిని, నీరు తాగినా చాలు. 

గ్లాస్‌ నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి.. ఆ నీటిని వడకట్టి వేడిగా ఉండగానే తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.