బనానా కివీ స్మూతీతో హుషారు!

కావలసినవి: పాలు–కప్పు, అరటిపండు–ఒకటి, కివి–ఒకటి, తేనె–మూడు టేబుల్‌ స్పూన్లు, లేత పాలకూర–కప్పు, ఆవకాడో–అర చెక్క, ఐస్‌క్యూబ్స్‌–కప్పు.

తయారీ: అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి

పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి

ఇప్పుడు బ్లెండర్‌ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి.

దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్‌ చేయాలి

అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్‌ వేసి మరొసారి గ్రైండ్‌ చేసి గ్లాసులో పోసుకోవాలి.

ఇందులో తేనె వేసి బాగా కలిపి సర్వ్‌ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

బనానా కివీ స్మూతీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.

క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి.

విటమిన్‌ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది.

పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది.

అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి.