కావలసినవి: సపోటా పండ్లు – రెండు, యాపిల్‌ – ఒకటి, కాచి, చల్లార్చిన పాలు – కప్పు, తేనె – టేబుల్‌ స్పూను,

వెనీలా ఎస్సెన్స్‌ – పావు టీస్పూను, వెనీలా ఐస్‌ క్రీమ్‌ – రెండు స్కూపులు, డ్రైఫ్రూట్స్‌ – గార్నిష్‌కు సరిపడా.

తయారీ: ముందుగా సపోటా, యాపిల్‌ తొక్క, గింజలు తీసేసి ముక్కలుగా తరగాలి

పండ్ల ముక్కలను బ్లెండర్‌లో వేసి పాలు, తేనె, వెనీలా ఎస్సెన్స్, ఐస్‌క్రీమ్‌ వేసి బ్లెండ్‌ చేసుకోవాలి.

ఈ షేక్‌ను గ్లాసులో పోసి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

సపోటాలో ఉన్న పీచుపదార్థం ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

దీనిలోని టానిన్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైర్, యాంటీ బ్యాక్టీరియల్‌ ఏజెంట్‌గా పనిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

దీనిలోని విటమిన్‌ ఏ, బీ, సీలు, కాపర్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్‌లు శరీరానికి తక్షణ శక్తినందిస్తాయి.

ఒత్తిడిని తగ్గించడంతోపాటు, రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, కంటిచూపుని మెరుగుపరుస్తుంది.