నవధాన్యాలలో నువ్వులు ఒకటి. సంస్కృతంలో వీటిని తిలలు అంటారు.

ఊరగాయ పచ్చళ్లలో నువ్వులనూనె వాడటం వల్ల చాలా కాలం నిల్వ ఉండటమేగాక రుచిగా కూడా ఉంటాయి.

దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు.

నువ్వులను దంచి, చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు.

బ్రెడ్‌లోనూ, బర్గర్లలోనూ, వివిధ రకాల వంటకాలలో, కూరలలోనూ వేస్తారు. వేయించి, పొడికొడతారు. పచ్చడి కూడా చేస్తారు.

నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్‌ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇందులోని జింక్‌ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నువ్వులు ఒమేగా–3, ఒమేగా –6, ఒమేగా– 9 ఆమ్లాలను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి.

గ్లాసు పాలల్లో కన్నా, స్పూను నువ్వుల్లో ఎక్కువ క్యాల్షియం ఉంటుందని అధ్యయనాలు తెల్పాయి.

ఇవి అమితంగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వేసవిలో ఎక్కువ తినరాదు.

అయితే శీతాకాలంలో నువ్వులను వాడటం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది.

అందుకే సంక్రాంతికి నువ్వుల ఉండలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం, అరిశలకు నువ్వులు అద్దడం ఆచారంగా మారింది.