బియ్యాన్ని కడిగి పారబోసేటప్పుడు నీళ్లు తెల్లగా వస్తాయి. ఈ నీళ్లను పారబోస్తే చాలా ప్రయోజనాలు మనం కోల్పోయినట్లే.

ఈ నీటిలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే గంజి గుణాలు జుట్టు, చర్మ సంరక్షణకు బాగా తోడ్పడతాయి.

బియ్యం కడిగిన నీటిలో ఇనోసిటాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి పోషణ అందిస్తుంది.

అంతేకాకుండా మెగ్నీషియం, జింక్, విటమిన్‌–బి, ఈ లు జుట్టు ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.

ఈ నీటిలో అధికంగా ఉన్న పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పీచుపదార్థం పేగుల కదలికలను వేగవంతం చేసి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది.

ఉడికించిన బియ్యం నుంచి తీసిన నీరు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

ప్రతి ఉదయం గ్లాసు బియ్యం కడిగిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కెఫీన్‌ లేని డ్రింక్‌ కాబట్టి ఏ హానీ ఉండదు.

బియ్యం కడిగిన నీటిలో ఎమినో యాసిడ్స్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి.

ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే ముఖంపై ముడతలు తగ్గి, చర్మం బిగుతుగా తయారవు తుంది.