వేసవిలో చల్లచల్లగా.. ఆమ్‌ పన్నాను ఇలా తయారు చేసుకోండి

కావలసినవి: పచ్చిమామిడికాయలు – అరకేజీ, పంచదార – అరకప్పు,

ఉప్పు – రెండు టీస్పూస్లు, దోరగా వేయించి పొడిచేసిన జీలకర్ర – రెండు టీస్పూన్లు,

పుదీనా తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – రెండు కప్పులు, ఐస్‌ ముక్కలు – నాలుగు.

తయారీ: ∙పచ్చిమామిడికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి.

ఉడికిన కాయల తొక్క తీసేసి, మామిడి కాయ గుజ్జును మిక్సీ జార్‌లో వేసుకోవాలి.

ఈ గుజ్జులో జీలకర్ర పొడి, పుదీనా తరుగు, పంచదార వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

అన్నీ గ్రైండ్‌ అయ్యాక రెండు కప్పుల నీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేసుకుంటే ఆమ్‌ పన్నా రెడీ. దీనిని గ్లాసులో వేసి ఐస్‌ ముక్కలతో సర్వ్‌ చేసుకోవాలి.

పచ్చిమామిడికాయలో ఉన్న విటమిన్‌ ఏ, ఈలు శరీరం లోని హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి.

దీనిలోని సోడియం క్లోరైడ్‌ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉల్లాసంగా ఉంచుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఈ జ్యూస్‌ కాలేయాన్ని శుభ్రపరిచి బైల్‌ ఆమ్లాలు సక్రమంగా విడుదలయ్యేట్టు చేస్తుంది.