జుట్టు విపరీతంగా రాలుతోందా...అయితే ఇలా చేయండి..రెండు బంగాళ దుంపలను తొక్కతీసి సన్నగా తురుముకోవాలి.

ఈ తురుములో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పది నిమిషాలు మర్దన చేయాలి.

తరువాత తలకు టవల్‌తో చుట్టి కవర్‌ చేయాలి.

రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, పెరుగుతుంది.

ఆహార పదార్థాలు వేటినైనా ఎక్కువ సేపు ఉడికించకూడదు. పదార్థాల్లో నీరంతా ఇగిరిన తరువాతే కూరలో ఉప్పు వేయాలి.

ఇలా చేయడం వల్ల విటమిన్లు వృథా కాకుండా ఉంటాయి..

జంతికలు, కారంబూందీ, చెక్కలు వంటివి నిల్వచేసే డబ్బాల్లో ఉప్పుని పలుచటి బట్టలో మూటకట్టి పెడితే పదార్థాలు నూనె వాసన రావు.

ఎక్కువ రోజులు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి