స్నాక్‌ రెసిపీ: మెంతి పకోడి తయారీ ఇలా

కావలసినవి: శనగపిండి– కప్పు

బియ్యప్పిండి– పావు కప్పు

మెంతి ఆకులు – కప్పు (కడిగి ఆరబెట్టాలి)

ఉప్పు – అర టీ స్పూన్‌ లేదా రుచికి తగినంత

కారం పొడి – టీ స్పూన్‌

ఇంగువ – పావు టీ స్పూన్‌

వాము – అర టీ స్పూన్‌

కొత్తిమీర – అర టేబుల్‌ స్పూన్‌ (తరగాలి)

ధనియాలు – టీ స్పూన్‌

పసుపు – అర టీ స్పూన్‌

నూనె– వేయించడానికి తగినంత

తయారీ: ∙శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు కలిపి జల్లించాలి

ఒక గరిటెడు నూనె వేడి చేసి పిండిలో కలపాలి

ఇప్పుడు పిండిలో మెంతి ఆకు, కారం పొడి, ఇంగువ, పసుపు, వాము, ధనియాలు వేసి బాగా కలిపి రెండు–మూడు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.

మెంతి ఆకు నుంచి నీరు పిండిలో కలుస్తుంది. ఇప్పుడు పిండిలో తగినంత నీటిని పోసి గట్టిగా కలుపుకోవాలి.

బాణలిలో నూనె మరిగిన తర్వాత పిండిని పకోడీలుగా లేదా బాల్స్‌గా వేసుకోవాలి.

దోరగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసి వేడిగా సర్వ్‌ చేయాలి.

డయాబెటిస్‌ ఉన్న వాళ్లు మెంతిని రోజూ తీసుకుంటే మంచిది. వారంలో ఓ రోజు ఇలా రుచిగా ఆస్వాదించవచ్చు.