ఎక్కిళ్లు ఎందుకు వస్తాయో తెలుసా!

సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు.

తరచూ ఈ సమస్య వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు తాగినా ఈ సమస్య అలాగే ఉంటుంది.

మనకు ఎక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్‌ కండరం సంకోచిస్తుంది.

వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. దీంతో స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ’హిక్‌’అనే ధ్వనికి కారణమవుతుంది.

అందుకే వీటిని ఇంగ్లిష్‌లో హికప్స్‌ అని పిలుస్తారు. తెలుగులో ఎక్కిళ్లు అంటారు

దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు ఎక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు.

ఒక్కోసారి ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటాయి. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా ఇలా వస్తాయి.

త్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్‌ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా ఎక్కిళ్లకు దారితీస్తాయి.

నవ్వడం, ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల వస్తుంటాయి.

ఒక్కోసారి ఏ కారణం లేకుండా కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశముంది.