Kitchen Tips: చింతపండు రంగు మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే..

మార్కెట్‌ నుంచి తెచ్చిన తరువాత చింతపండులో ఉన్న పీచు, గింజలను తీసేసి ఒకరోజంతా ఎండలో ఆరబెట్టాలి.

తరువాత ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి, పైన కాస్త ఉప్పు చల్లి మూతపెట్టి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.

ఇలా చేస్తే చింతపండు నెలల పాటు తాజాగా ఉంటుంది.

*కూరగాయలు తొందరగా పాడయిపోతుంటే..

నిమ్మరసం కలిపిన నీటిలో ఒక గంటపాటు ఉంచితే కూరగాయలు తాజాగా ఉంటాయి.

పప్పులు, కారం, మసాలాలు నిల్వ చేసేటప్పుడు తేమ ఉన్నట్లయితే వాటికి పురుగులు పడతాయి

ఇంట్లోని నిత్యావసర సరుకులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

బియ్యం, గింజలు, మసాలాలు నిల్వ ఉంచిన డబ్బాలో వేప ఆకులను వేయాలి.

వేప ఆకుల వల్ల పురుగులు రావు. ఒకవేళ పురుగులు అప్పటికే ఉంటే అవి కూడా చనిపోతాయి.

నిల్వ చేసిన పిండిలో ఎర్ర మిరపకాయలను వాడితే పురుగులు, కీటకాల సమస్య ఉండదు.

నిల్వ చేసిన పప్పులు, గింజల మధ్య అగ్గిపెట్టెలను ఉంచితే పురుగులు రావు.