ఉసిరికాయ పచ్చడి తయారీ ఇలా

కావలసినవి: ఉసిరికాయలు – 250 గ్రాములు

నూనె– 4 టేబుల్‌ స్పూన్‌లు

ఆవాలు – 2 టీ స్పూన్‌లు

నిమ్మకాయ– 1 (పెద్దది)

కారం పొడి– 4 టేబుల్‌ స్పూన్‌లు, పసుపు – పావు టీ స్పూన్‌

ఉప్పు – 4 టీ స్పూన్‌లు (ఎవరి అభిరుచికి తగినట్లు మార్చుకోవాలి)

వెల్లుల్లి– ఒకటి (రేకలు ఒలిచి పెట్టుకోవాలి)

మెంతులు – చిటికెడు

తయారీ విధానం

ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తేమ పోయేటట్లు తుడవాలి.

ఆవాలు, మెంతులను మిక్సీలో వేసి పొడి చేయాలి

ఆరిన ఉసిరి కాయల మీద చాకు లేదా ఫోర్కుతో గాట్లు పెట్టాలి

బాణలిలో నూనె వేడి చేసి ఉసిరి కాయలు ముదురు గోధుమ రంగు వచ్చే వరకు మగ్గనివ్వాలి

కాయల్లో వెల్లుల్లి రేకులు వేసి స్టవ్‌ ఆపేయాలి

ఉసిరి కాయల వేడి తగ్గిన తరవాత ఆవాలు–మెంతుల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి

మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేయాలి

రెండు రోజుల తర్వాత స్పూన్‌తో పచ్చడిని మరోసారి కలపాలి

ఇది అన్నం, చపాతీలతో రుచినివ్వడంతోపాటు కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.