‘పంచాంగం’ అంటే ఏమిటి?

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు కలది అని అర్థం.

పాడ్యమి నుంచి పూర్ణిమ లేదా అమావాస్య వరకు 15 తిథులు

ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు

అశ్వని మొదలు రేవతి వరకు 27 నక్షత్రాలు

విష్కంభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగాలు

బవ మొదలుకొని కిం స్తుఘ్నం వరకు11 కరణాలు ఉన్నాయి

వీటన్నిటినీ తెలిపేదే పంచాంగం.

‘పంచాంగ శ్రవణం’ ఉగాది విధుల్లో ఒకటి.

నేడు పల్లెటూళ్లు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము .