కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.

క్యాజువల్‌ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు.

బెనారస్‌ లాంగ్‌ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

క్యాజువల్‌ లుక్‌లో స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్‌ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు.

కాటన్‌ శారీస్‌కు టర్టిల్‌ నెక్‌ ఉన్న స్వెట్‌ షర్ట్‌.. ప్రయాణాలు, సింపుల్‌ గెట్‌ టు గెదర్‌లకు ఈ స్టైల్‌ బాగా నప్పుతుంది.

కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరకు ఓపెన్‌ ఫ్రంట్‌ పెప్లమ్‌ జాకెట్తో పార్టీవేర్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది.

ఒక్క పెప్లమ్‌ ఓపెన్‌ టాప్‌తో మీదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు.

పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్‌ జాకెట్‌తో ఉన్న డ్రెసింగ్‌ రెడీమేడ్‌ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తారు.

పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లాలంటే.. ఇలా పట్టుచీరకు లాంగ్‌ స్లీవ్స్‌ ఉన్న వైట్‌ షర్ట్‌ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్‌ బెల్ట్‌తో తయారవ్వచ్చు.