టొమాటో పకోడా తయారీ

కావలసినవి: టొమాటో ముక్కలు – 15 పైనే (గుండ్రంగా చక్రాల్లా కట్‌ చేసుకోవాలి)

కొత్తిమీర గుజ్జు – పావు కప్పు

మిరియాల పొడి – కొద్దిగా

బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున

శనగపిండి – పావు కప్పు+3 టేబుల్‌ స్పూన్లు

కారం – 1 టీ స్పూన్, పసుపు – చిటికెడు

నిమ్మరసం – 2 టీ స్పూన్లు

నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ:

ముందుగా కొత్తిమీర గుజ్జులో నిమ్మరసం, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.

ప్రతి టొమాటో ముక్కకు ఒకవైపు పలచగా జామ్‌ మాదిరి పూసి.. పక్కన పెట్టుకోవాలి.

అనంతరం ఒక బౌల్‌ తీసుకుని శనగపిండి, కారం, పసుపు, ఉప్పు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. తగినంత నీళ్లు పోసి కాస్త పలుచగా కలుపుకోవాలి.

అందులో కొత్తిమీర మిశ్రమాన్ని అద్దిన టొమాటో ముక్కలను ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి.