కావలసినవి: శనగపిండి – కప్పు, టొమాటో ముక్కలు – కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు,

అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి తరుగు – టీస్పూను, కొత్తిమీర తరుగు – మూడు టేబుల్‌ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను,

ఇంగువ – చిటికెడు, గరం మసాలా – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్‌ – ఫ్రైకి సరిపడా.

తయారీ ∙ఒక పెద్ద గిన్నె తీసుకుని టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర తరుగు, శనగపిండి, ఇంగువ , పసుపు, కారం, గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపాలి.

దీనిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా గరిట జారుగా కలపాలి.

పదినిమిషాలు తరువాత.. వేడెక్కిన పాన్‌పై కొద్దిగా ఆయిల్‌ వేసి పిండిని ఆమ్లెట్‌లా పోసుకోవాలి.

సన్నని మంట మీద..అవసరాన్ని బట్టి ఆయిల్‌ వేస్తూ రెండు వైపులా కాల్చాలి

ఇలా చేస్తే టొ మాటో టామ్లెట్‌ రెడీ

చట్నీ, సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది