ముఖారవిందానికి కళ తెచ్చేవి కళ్లు, కనుబొమ్మలు

కనుబొమ్మలను తీర్చి దిద్దుకుంటే అందం ద్విగుణీకృతం అవుతుంది

కొందరికి కనుబొమలు పలచగా ఉంటాయి.

అలాంటివారు ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌..ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి.

తరువాత ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపర్చుకోవాలి.

రోజూ పడుకోబోయే ముందు ఈ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని రెండు కనుబొమలపై మర్దనా చేసుకోవాలి.

ఇలా రోజూ చేయడం వల్ల కనుబొమలపై ఉన్న వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.