మసాలా మిల్క్‌ తాగితే కలిగే ప్రయోజనాలు

గ్లాసు పాలు తీసుకుని వేడిచేయాలి.

పాలు కాగాక చల్లారనివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు

దానిలో చిటికెడు పసుపు

పావు స్పూను దాల్చిన చెక్క పొడి

తాజాగా దంచిన పావు స్పూను మిరియాల పొడిని బాగా కలపాలి

ఒక పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి

పదినిమిషాల తరువాత ఈ మసాలా మిల్క్‌ను తాగాలి

తరచుగా దీనిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కడుపులో మంటగా అనిపించినప్పుడు గ్లాసు గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి.

దానిలో స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలిసి తాగితే కడుపులో మంటకు కారణమైన ఆమ్లాలు తటస్థీకరించబడి మంట తగ్గుతుంది.