నోరూరించే టొమాటో ఆమ్లెట్‌

కావలసినవి: శనగపిండి– కప్పు

టొమాటో ముక్కలు – కప్పు (సన్నగా తరగాలి)

ఉల్లిపాయలు– పావు కప్పు (సన్నగా తరగాలి)

తరిగిన అల్లం – టీ స్పూన్‌

తరిగిన పచ్చిమిర్చి – టీ స్పూన్‌

తరిగిన కొత్తిమీర – 3 టేబుల్‌ స్పూన్‌లు

పసుపు – పావు టీ స్పూన్‌

మిరప్పొడి– పావు టీ స్పూన్‌

ఇంగువ– చిటికెడు

గరం మసాలా – చిటికెడు

బేకింగ్‌ పౌడర్‌– పావు టీ స్పూన్‌ (ఇష్టమైతేనే)

ఉప్పు – పావు టీ స్పూన్‌ లేదా రుచిని తగినంత

నీరు– కప్పు లేదా మిశ్రమం చిక్కదనాన్ని బట్టి

నూనె లేదా నెయ్యి– 2 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ: ∙ఒక పాత్రలో శనగపిండి వేసి అందులో టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఇంగువ, పసుపు, మిరప్పొడి, బేకింగ్‌ పౌడర్, గరం మసాలా వేసి కలపాలి.

ఇందులో నీటిని పోస్తూ బీటర్‌తో (ఉండలు లేకుండా) కలపాలి. ఈ మిశ్రమం దోసెల పిండిలాగ గరిటజారుడుగా ఉండాలి.

ఆమ్లెట్‌ల పెనంలో రెండు టీ స్పూన్‌ల నెయ్యి వేడి చేసి ఒక గరిటెడు మిశ్రమాన్ని వేసి పెనం మీద సమంగా గరిటెతోనే సర్ది చుట్టూ కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి మీడియం మంట మీద కాలనివ్వాలి.

ఒకవైపు కాలిన తరవాత తిరగేసి మరొక టీ స్పూన్‌ నెయ్యి వేసి రెండో వైపు కూడా కాలిన తరవాత తీసేయాలి. ఇలాగే పిండినంతటినీ ఆమ్లెట్‌లు వేసుకోవడమే.

గమనిక: ఆమ్లెట్‌ మెత్తగా రావాలంటే మూత పెట్టి కాలనివ్వాలి. అంచులు కరకరలాడుతూ ఉండాలంటే మూత పెట్టకుండా కాల్చాలి. వెన్న రుచి ఇష్టపడే వాళ్లు వెన్నతో ఆమ్లెట్‌లు వేసుకోవచ్చు.

ఒకవైపు కాలిన తరవాత తిరగేసి మరొక టీ స్పూన్‌ నెయ్యి వేసి రెండో వైపు కూడా కాలిన తరవాత తీసేయాలి. ఇలాగే పిండినంతటినీ ఆమ్లెట్‌లు వేసుకోవడమే.