వేసవి వచ్చిందంటే చల్లదనంతో పాటు అందాన్ని, హుందాతనాన్ని పెంచే కాటన్ తప్ప మరో మెటీరియల్ వైపు చూడటానికి చాలా మంది ఇష్టపడరు.

అయితే కాటన్‌కు అందాన్ని తెచ్చేది మాత్రం గంజి!

నిజానికి మార్కెట్లో దొరికే గంజి పౌడర్ కంటే... ఇంట్లో చేసుకున్న గంజివల్ల బట్టలు మరింత అందంగా ఉంటాయంటయన్నది వస్త్ర నిపుణుల అభిప్రాయం.

ఆరు రకాలుగా గంజిని ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు

మొక్కజొన్న పిండిని చల్లని నీటిలో వేసి కలిపి బాగా మరిగించాలి.

ఇందులో ముంచి ఆరబెడితే కాటన్ దుస్తులు చక్కగా తళతళలాడతాయి.

బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి.

ఆ నీటిని రాత్రంతా ఉంచి, ఉదయం లేచాక వడగట్టుకుని బట్టలకు పెట్టాలి.

అన్నం ఉడికించిన నీటిని తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు కలిపితే మంచి గంజి తయారవుతుంది.

పచ్చి కూరగాయల్ని శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి.

తర్వాత ఆ నీటిని వడపోసుకుని, అందులో బట్టల్ని ముంచి తీసి ఆరబెట్టాలి.

చేమదుంపల్ని కెమికల్ ట్రీటెడ్ స్టార్చ్ తయారీలో ఉపయోగిస్తుంటారు.

కాబట్టి దీనితో కూడా మనం గంజి చేసుకోవచ్చు. ముందుగా వీటిని చెక్కి, మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్లుపోసి మరిగించాలి.

తర్వాత దాన్ని వడగట్టి బట్టలకు పట్టించాలి.

అన్నం ఉడికించిన నీళ్లు గంజిలా ఉపయోగపడినట్టే... గోధుమల్ని ఉడికించిన నీళ్లు కూడా గంజిలాగా ఉపయోగపడతాయి.

అయితే, ఏ గంజి అయినాగానీ... చల్లారిన తర్వాతే దుస్తులకు పెట్టాలి తప్ప వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెట్టకూడదు