చద్దన్నం తినే అలవాటు దాదాపు వెయ్యేళ్ల నాటిది.

రకరకాల పద్ధతుల్లో చద్దన్నం తయారు చేసుకుంటారు.

ఏ పద్ధతిలో తయారు చేసుకున్నా, చద్దన్నం మేలు కలిగించేదేనని అటు ఆయుర్వేద నిపుణులు, ఇటు ఆధునిక వైద్యుల మాట

ప్రస్తుతం కొన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లు సైతం చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి

ఒడిశాలో చద్దన్నాన్ని ‘పొఖాళొ’ అంటారు.

పూరీలో జగన్నాథుడికి ప్రతిరోజూ నైవేద్యంగా పెట్టే ‘ఛప్పన్న భోగాలు’– యాభై ఆరు పదార్థాలలో ‘పొఖాళొ’ కూడా ఒకటి.

తెలుగు రాష్ట్రాల్లో చద్దన్నం వాడుక కొంత తక్కువే

ఉత్తరాంధ్ర జిల్లాల్లో చద్దన్నాన్ని ‘పకాలన్నం’ అంటారు.

రాత్రి వండిన అన్నంలో నీళ్లుపోసి దాదాపు 8 నుంచి 12 గంటల సేపు నానబెడతారు.

మర్నాటి ఉదయానికి ఈ నీరు పులిసి, చద్దన్నానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.

ఇలా పులిసిన నీటిని ‘తరవాణి’ అంటారు. సాధారణంగా చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటారు.