గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు – ఒకటిన్నర కప్పు, నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు

పుదీనా ఆకులు – రెండు టేబుల్‌ స్పూన్లు మిరియాల పొడి – పావు టీస్పూను

ఐస్‌ ముక్కలు – కప్పు.

తయారీ ఇలా!

బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

దీనిలోనే నిమ్మరసం, పుదీనా ఆకులు, మిరియాల పొడి వేసి మరోసారి గ్రైండ్‌ చేయాలి.

ఇవన్నీ మెత్తగా గ్రైండ్‌ అయిన తరువాత గ్లాసులోకి వడగట్టాలి.

ఈ జ్యూస్‌లో ఐస్‌ ముక్కలు వేసుకుని తాగితే ఎండల్లో దాహార్తి తీరి ఫ్రెష్‌గా ఉంటుంది.