బరువు పెరుగుతున్నారని చాలా మంది నెయ్యిని పక్కన పెడుతారు.

అయితే, ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌ కే2, విటమిన్‌ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్‌ ఆమ్లాలు ఉన్నాయి.

వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.

అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి.

కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది.

తొందరగా అలసట కలగదు.

నెయ్యిలో బ్యుటిరిక్‌ యాసిడ్‌ ఉంటుంది. దీనిని పెద్ద పేగు కణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి.

హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది.

ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను కాపాడుతుంది.

గుండె పనితీరు, కంటి చూపును మెరుగుపరుస్తుంది.