కీరదోస ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంపొందించడంలోనూ తోడ్పడుతుంది.

ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఉపకరిస్తుంది.

రెండు టేబుల్‌ స్పూన్ల కీరదోస పేస్టులో టీస్పూను పాలుపోసి చక్కగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేయాలి.

15 నిమిషాలు ఆరాక నీటితో కడిగేయాలి.

వేసవి కాలంలో రోజుకొకసారి ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖ చర్మానికి చల్లదనం అందుతుంది.

దీంతోపాటు చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.