రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించాడు.

దీనినే అభిజిత్‌ లగ్నమనీ, అభిజిత్‌ ముహూర్తమనీ అంటారు.

శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండుగగా జరుపుకొంటారు.

చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి.

శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు.

శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారమవుతాం.

అంతేగాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.