సాధారణంగా హోల్‌ చికెన్‌ వంటి పెద్దపెద్ద గ్రిల్‌ ఐటమ్స్‌ కోసం.. పెద్దపెద్ద డివైజెస్‌ ఉండాలని భావిస్తాం.

ఈ డివైజ్‌ని చూడండి ఎంత నాజూగ్గా, సన్నగా కనిపిస్తోందో.

ఇందులో హోల్‌ చికెన్‌ను భలే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు.

అయితే నిలువుగా రోస్ట్‌ కావాల్సిన ఆహారాన్ని ఇది అడ్డంగా రోస్ట్‌ చేస్తుంది.

అదనపు గ్రిల్‌ పాన్‌ను మేకర్‌కి అటాచ్‌ చేసుకుని.. వెజ్, నాన్‌ వెజ్‌ ఐటమ్స్‌ని క్రిస్పీగా గ్రిల్‌ చేసుకోవచ్చు.

దీనిలోని ఆప్షన్స్‌ సెట్‌ చేసుకోవడానికి కుడివైపు ముందుభాగంలో రెండు రెగ్యులేటర్స్‌ ఉంటాయి.

దీనిలోని ఆహారం గ్రిల్‌ అయిన తర్వాత వాటి నుంచి వెలువడిన వ్యర్థాలు.. అడుగున ఉన్న ట్రేలో పడతాయి.

దాన్ని సులభంగా కుడివైపు కింద భాగం నుంచి బయటికి తియ్యొచ్చు. దాంతో క్లీనింగ్‌ ఈజీ అవుతుంది.